Home » Chittoor
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఈవో శ్యామలారావు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈవోగా బాధ్యతలు తీసుకొని నెల రోజుల అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చాలా లోపాలను గుర్తించానన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భారీ భూ అక్రమాల్లో ఇదొకటి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లెలో 982 ఎకరాల భూమిని నిబంధనలకు పాతరేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరిట మార్చారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లెలోని 982 ఎకరాల ఎస్టేట్ భూములపై 1970 నుంచీ వివాదం నడుస్తోంది. దీన్ని పట్టా భూమిగా పేర్కొం టూ ఇచ్చిన ఉత్తర్వులను అనేక దశల్లో అధికారులు కొట్టివేస్తూ వచ్చారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి భూముల దందాలకు బ్రేక్ వేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్. పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు కాజేశారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (మంగళవారం) ఆణివార ఆస్థానం పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో తీసుకురానున్నారు.
Andhrapradesh: నేరాలను అదుపు చేయడం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం, కర్నూలు రేంజ్ ఫీల్డ్ విజిట్ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సవాళ్ళను ప్రతి సవాళ్ళను పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కోంటున్నామన్నారు. పోలీసు డిపార్ట్మెంట్లో వాహనాలు పాతబడ్డాయని.. వాటిని అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు రాజీనామా చేసి జంప్ చేయగా.. తాజాగా ఓ బిగ్ షాట్ టీడీపీలో చేరబోతున్నారు..!
Andhrapradesh: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ మంచి చేసినా ఎలా ఓడిపోయారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికలు ఎలా జరిగాయో.. ఎలా టాపరింగ్ జరిగిందో.. కూటమి పార్టీ ఎలా గెలిచిందో అనేది దేశమంతా కోడై కూస్తోందన్నారు.
తిరుమల: కలియుగ వైకుంఠ నాథుడైన తిరుమలేశుడికి నివేదించే అన్న ప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. సేంద్రీయ బియ్యం స్థానంలో సాధారణ బియ్యం వినియోగించాలని భావిస్తోంది. త్వరలోనే స్వామివారికి సాధారణ బియ్యంతో చేసిన అన్న ప్రసాదాలను టీటీడీ నివేదించనుంది.