Home » CM Revanth Reddy
తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిపై త్వరలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని నిఖిల్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునంటూ సొల్లు వాగుడు వాగుతున్నాడని తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు. తనకు నేరుగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ ప్రచారం సైతం చేసుకుంటున్నాడన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఉదయం 8 గంటలకు కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Telangana: తెలంగాణ సీఎం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. దీంతో జీవితంలో ఆయనకు గుర్తుండుపోయేలా ఓ కానుకను ఇచ్చారు. సైకత శిల్పాలకు ఫేమస్ అయిన ఒడిశాలోని పూరి బీచ్‌లో రేవంత్ సైకత శిల్పాన్ని వేయించి.. ఆయనకు బర్త్‌డే కానుకను అందజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.
వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను నమ్మించి మోసం చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) ఆరోపించారు.
తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం.. కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం.. కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తోందని, ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మేఘా అధినేత కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించిన కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ పనుల ఒప్పందాన్ని రేవంత్ సర్కారు రద్దు చేసింది.
కొత్తగూడెంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి వినతిపత్రం అందించారు.
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం కొత్త ఆర్వోఆర్ ముసాయిదాపై సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.