Home » Exams
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎగ్జామ్స్ ( Education ) రాసేసిన స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాల ( Education ) నేపథ్యంలో మే లో నిర్వహించనున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు వివరాలు వెల్లడించింది.
Andhrapradesh: గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 17వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలను గత రాత్రి విడుదల చేశారు. అయితే రాత్రి పూట ఫలితాల విడుదలపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అభ్యంతరం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అర్థరాత్రి గ్రూప్స్1 పరీక్షల ఫలితాలు విడుదల చేయడం వెనుక ఆంత్యర్యం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడంపై కూడా టీడీపీ నేతల విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
Andhrapradesh: గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ఆలస్యంపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు గ్రూప్ 2 అభ్యర్థులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఏపీలోని నిరుద్యోగులు గత అయిదు సంవత్సరాలుగా గ్రూప్- 2 ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతున్నామని తెలిపారు. ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జరిగిందని.. నాలుగు వారాల్లో ఫలితాలు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించిందన్నారు. ప్రిలిమినరీ ఫలితాలు విడుదల అయితే మేయిన్స్ కు సన్నద్దం కావడానికి ఎదురుచూస్తున్నామన్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు(APPSC Group 1 Exam) సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు(AP High Court). అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి(Single Judge) ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో స్టే విధించింది డివిజనల్ బెంచ్.
నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది.
గుండెపోట్లు విద్యార్థులను సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానో లేదంటే నిద్రలేమి కారణమో తెలియదు కానీ పదో తరగతి విద్యార్థిని పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్ర పాడు గ్రామంలో జరిగింది.
Andhrapradesh: ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్రోల్ అయినవారు 1,02,528 మంది ఉన్నారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.