Home » Exams
దేశంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 7 దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మొదటిదశ పోలింగ్ ఏప్రియల్ 19న ప్రారంభమై.. జూన్1న చివరి దశ పోలింగ్‌తో ఎన్నికలు (Elections) ముగుస్తాయి. జూన్ 4న ఓట్లు లెక్కిస్తారు. ఈ దశలో ఏప్రియల్, మే నెలలో జరగాల్సిన కొన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడనున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఏపీపీఎస్సీ గ్రూప్-1ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్షా 48వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
ఉపాధ్యాయ నియామకాల భర్తీ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ( TSTET ) నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి కఠిన ఆంక్షలతో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర నో సెల్ ఫోన్ జోన్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగేంత వరకూ అవసరమైతే జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయించే యోచనలో అధికారులు ఉన్నారు.