Home » Farmers
అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
వానలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
పంట ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో శంభూ సరిహద్దులో ఏడాది కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.
దేశంలో వ్యవసాయాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త పథకాలను ప్రకటించింది. వీటిల్లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్(రూ.2,817 కోట్లు), క్రాప్ సైన్స్ స్కీమ్(రూ.3,979 కోట్లు) ఉన్నాయి.
పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు చనిపోయా డు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలో శనివారం రాత్రి జరిగింది.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ హరియాణా-ఢిల్లీ సరిహద్దు శంభూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు మేటి రెజ్లర్ వినేశ్ ఫొగట్ మద్దతు పలికారు.
రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన, బెల్ కంపెనీలకు భూములు ఇచ్చిన రైతులకు ఆర్అండ్ఆర్ చట్టం అమలు చేసి, పరిహారం అందించాలంటూ భూనిర్వా సితులు చేపట్టిన వంటావార్పు నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. వారు సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండురోజల నిరసన క్యాక్రమాన్ని మంగళవారం చేపట్టిన విషయం విదితమే. రెండో రోజు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు వెంకటేశ, మహిళా సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్షాద్ హాజరై ప్రసంగిం చారు.
రాష్ట్రంలో పత్తి రైతులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రాష్ట్రంలో పండించే పత్తి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు.
రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.