Home » Farmers
వ్యవసాయ రుణాలు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
ఖరీఫ్ పై ప్రతికూల ప్రభావం పడింది. అతివృష్టి, అనావృష్టి వాతావరణంతో ప్రధాన పంటలతో సహా మిగిలిన పంటల సాగు మందకొడిగా మారింది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టింది.
Andhrapradesh: జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్లో సీఆర్పీ మండిని రైతులు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మండి అసోసియేషన్ అధ్యక్షుడినంటూ సీఎంఆర్ మండీ నిర్వాహకుడు అమర్నాథ్ అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు. వ్యాపారస్థులను టమోటా ఆక్షన్ వేయకుండా బెదరింపులకు గురిచేయడంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్‌పామ్ కంపెనీలు వెంటనే ఫ్యాక్టరీల నిర్మాణాలు చేసి, ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ మొదలుపెట్టేలా కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా, ఘట్కేసర్ మండలంలోని రైతులకు ఇప్పటి వరకు అందలేదు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న ప్రభుత్వం.. రూ.2 లక్షలకు మించి తీసుకున్న రుణాల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు.
గోరంట్ల మండల సమీపంలోని నాసెన, బెల్ కంపెనీల కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాలలోని వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం భూనిర్వాసితులతో కలిసి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాల యం వద్ద నిరసన తెలిపారు. అనంతరం సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి అందించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఏనాడూ పట్టించుకోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పథకం అమలుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహించారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం కలెక్టర్ శ్యారమ్‌పసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా గొరడ గిరిజన గ్రామంలో రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు.
వ్యవసాయంలో నష్టాలు రావడంతో సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు, కరెంటు షాక్‌తో ఇద్దరు అన్నదాతలు చనిపోయారు.