Home » Farmers
జక్రాన్పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పంట రుణమాఫీ పథకం అమలు సమయంలో 30వేల రైతుల ఖాతాల్లో సమస్యలు గుర్తించామని టెస్కాబ్(తెలంగాణ స్టేట్ కో- అపరేటివ్ అపెక్స్ బ్యాంకు) ఎండీ డాక్టర్ బి.గోపి తెలిపారు.
చేనత వస్త్రాలను వినియోగిద్దాం.. నేతన్నలకు అండగా ఉందామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత రంగం అభివృద్ధికి, నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.
రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు.. ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది.
రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం.. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఘనవిజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు సహకారం లభించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు(Seetharama Project) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ఈనెల 9వ తేదీన టెండర్లు పిలవనున్నారు.
ఆంక్షలుపెట్టి అరకొరగా రుణమాఫీ చేసి అంతా అయిపోయినట్లు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రమింపచేస్తోందని, అన్నదాతలు బ్యాంకులచుట్టూ తిరుగుతూ పడిగాపులు గాస్తున్నారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ... అర్హులైన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ఆయా ప్రాంతాల రైతులు సోమవారం బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు.