Home » G. Kishan Reddy
రాబోయే ఎన్నికల్లో పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు కిషన్ రెడ్డి హనుమకొండ జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో భద్రకాళీ అమ్మవారి ఆలయంలో బీజేపీ అధ్యక్షులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బీజేపీ సభా ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు.
అనారోగ్యం వల్లే కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నానని, కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. అధిష్టానం ఏ ఆదేశాలిచ్చినా పాటిస్తానని, తనకు అధ్యక్ష పదవి ఇస్తారని అనుకోలేదని అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులను అధిష్టానం ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో అయోమయం నెలకొంది. ఏం జరుగుతోందన్న గందరగోళం చోటుచేసుకుంది. ప్రాముఖ్యంగా తెలంగాణలో అయితే గజిబిజీ గందరగోళంగా మారింది. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించారు. అసలు బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారో.. కిషన్‌రెడ్డిని ఎందుకు నియమించారో ఆ పార్టీ సీనియర్లకు అర్థంకాక తలలు పట్టుకున్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు ఢిల్లీలో ఉండి కూడా కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఆయనను తెలంగాణ అధ్యక్ష పదవిని అప్పగించిన అనంతరం అసలు ఆయన ఎక్కడా స్పందించింది లేదు. మీడియా ముందుకు సైతం వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
కేబినెట్ బేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని.. అందుకే కేబినెట్ భేటీకి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే అనారోగ్య కారణాల వల్లనే కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారని అధికారులు అంటున్నారు. కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలో కొనసాగించడంపై సస్పెన్స్ నెలకొంది.
తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయి మరీ సోషల్ వార్ నిర్వహిస్తోంది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయి. వాటిలో రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా వార్ జరుపుతున్నాయి. మూడో వర్గం మాత్రం సైలెంట్. సోషల్ మీడియాలో ఎవరికి వారే పోస్టులు పెడుతున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ క్యాడర్ పోస్టులు పెడుతోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించటాన్ని ఈ వర్గం తప్పు పడుతోంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు.
రాజకీయాల్లో కానీ.. ఏదైనా ఉద్యోగంలో కానీ.. సినీ ఇండస్ట్రీలో కానీ.. ఫామ్‌లో ఉన్నంత వరకే ప్రాధాన్యత. ఆ తరువాత వంగి వంగి సలామ్ కొట్టిన వారే నువ్వెంత అన్నట్టుగా చూస్తారు. ప్రస్తుత రోజులు అలాగే ఉన్నాయి. అవసరపడతారు అంటే ఒక లెక్క.. లేదనుకుంటే మరో లెక్క. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పరిస్థితి అలాగే ఉంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. నేడు బీజేపీ అధిష్టానం పెద్దలను ఆయన కలవనున్నారు. అధిష్టానం పెద్దలతో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో ఆయన పదవి విషయమై రకరకాల ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్ కూడా తాజాగా కార్యకర్తల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశారు.