Home » Guntur
2008 నుంచి ఇప్పటివరకూ అన్నీ ప్రభుత్వ ఉత్తర్వులూ జీవోఐఆర్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 మధ్య విడుదల చేసిన ఉత్తర్వులు మాత్రం సైట్లో అప్లోడ్ చేయలేదు.
Andhrapradesh: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1 గా ఉన్న వైసీపీ నేత పానుగంటి చైతన్య కస్టడీ ముగియడంతో ఈరోజు (సోమవారం) ఏపీ సీఐడీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. చైతన్యను మూడు రోజుల పాటు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాడికి సంబంధించి పలు ముఖ్య విషయాలను సీఐడీ పోలీసులకు చైతన్య చెప్పినట్లు తెలుస్తోంది.
అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు తాను సలహాదారుగా ఉన్నానని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ వెల్లడించాడు.
అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్‌కు ఏ మాత్రం తీసిపోని జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నేరమయ జీవితం ముగింపు కూడా అలానే ఉండబోతుందన్నారు. లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినందుకే 16 నెలలు జైల్లో జంటగా చిప్పకూడు తిన్న సంగతి జగన్ రెడ్డి, సాయిరెడ్డి మర్చిపోకూడదని కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చాలా మంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. పలువురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ.. జగన్ మాదిరిగా..
వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికే 4 నెలలు పట్టిందని, వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది జరిగిన ఘటనపై శనివారం నాడు కేసు నమోదు చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న అనిల్‌ను కస్టడీకి తీసుకున్నారు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాళ్టి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటిలాగానే రూ.100లు కట్టి సాధారణ సభ్యత్వం తీసుకోవచ్చంటూ తెలుగు తమ్ముళ్లు పార్టీ శుభవార్త చెప్పింది. ఎవరైనా లక్ష రూపాయలు కడితే వారికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది.
Andhrapradesh: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. దాచేపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రికి కలెక్టర్ చెప్పారు.