Home » International News
రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ రాకేట్ను విజయవంతంగా ప్రయోగించింది.
హోరాహోరీగా ప్రచారం కొనసాగిన 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం తుది అంకానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు కాలమానాల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
అమెరికా ప్రతినిధులసభ ఎన్నికల్లో భారత సంతతి పౌరులు తమ సత్తా చాటుతున్నారు. మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఐదుగురు సీనియర్ నాయకులు మరోసారి బరిలో నిలిచారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్లో వలే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించదు. యూఎస్ లో 50 రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిర్వహించు కుంటుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడం ఆలస్యమవుతుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల వేళ.. న్యూయార్క్ నగరంలో బ్యాలెట్ పేపర్లో భారతీయ భాషకు చోటు కల్పించింది. అత్యధికంగా మాట్లాడే హిందీకి కాకుండా.. మరో భాషకు అవకాశం కల్పించింది. అదీ కూడా ఓ ప్రాంతీయ భాష కావడం గమనార్హం.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకు పోయారు. వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
దుబాయిలో గత వారం ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. తాజాగా ఆ దేశ ఉత్తర ప్రాంతంలో భారీగా మంచు కురుస్తుంది. దీంతో ఆ ఎడారి ప్రాంతంతోపాటు రహదారులపై భారీగా మంచు కురుస్తుంది. అయితే ఎడారి ప్రాంతమైన.. దుబాయ్లో ఇలా వర్షాలు, మంచు కురవడంపై ఆ దేశంలోని వాతావరణ విభాగం స్పందించింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైంశకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి కాన్బెర్రాలో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెనడాలోని బ్రాంప్టన్లో హిందూ దేవాలయంపై దాడి ఘటనను ఎండగట్టారు.
US Elections 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం (నవంబర్ 05, 2024) ఓటింగ్ జరగనుంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అనేక దశల్లో ఓటింగ్ జరుగుతుంది. కానీ, అమెరికాలో మాత్రం ఒకే రోజు జరుగుతుంది. అవును, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఒక రోజు మాత్రమే ఓటింగ్ ఉంది.