Home » Maharashtra
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో ప్రచారానికి రావాల్సిందిగా శివసేన-యూబీటీ, ఎన్సీపీ-ఎస్పీ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటీవల కోరారు. ఇందుకు సానుకూలంగా కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ కార్యకర్తలు ఉన్న ప్రాంతాల్లోనూ, వివాద రహిత అభ్యర్థులు ఉన్న చోట్ల ప్రచారానికి ఆయన అంగీకరించారు.
2019 ఎన్నికల్లో బాంద్రా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీషన్ సిద్ధిఖీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత ఆగస్టులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీషన్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని పార్టీ నుంచి అతన్ని కాంగ్రెస్ బహిష్కరించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో బారమతి అసెంబ్లీ అభ్యర్థిగా యోగేంద్ర పవార్ పేరును ఎన్సీపీ (శరద్ పవార్) గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఇదే స్థానం నుంచి ఎన్సీపీ (అజిత్ పవార్) అభ్యర్థిగా అజిత్ పవార్ బరిలో దిగారు. అదీకాక అజిత్ పవార్ తమ్ముడి కుమారుడే ఈ యోగేంద్ర పవార్.
మహారాష్ట్రలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎమ్వీఏ) సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది.
'మహా వికాస్ అఘాడి' కూటమి మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్‌పవార్ ఎన్సీపీ సమానంగా 85-85-85 సీట్లకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. 288 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహా వికాస్ అఘాడీలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే) నేతలు బుధవారం ముంబయిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు అంశంపై జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ మూడు పార్టీలు చెరి సమానంగా సీట్ల పంచుకోనున్నాయి. మిగిలిన స్థానాలను మిగతా మిత్ర పక్షాలకు కేటాయించాలని నిర్ణయించాయి.
38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది. బారామతి నుండి అజిత్ పవార్, యోలా నుండి ఛగన్ భుజబల్‌ను ఎన్నికల బరిలో నిలిపింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలు, జాబితాల విడుదల పరంగా మహాయుతి కటమి ముందంజలో ఉంది. అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ప్రధానమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించి అనధికారికంగా ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుడా వారిని గమ్యానికి చేర్చేందుకు రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ దిలీప్ సింగ్ తెలిపారు. చెప్పారు. ఒక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశామన్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.