Home » Maharashtra
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుపనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.
రైళ్లలో మరుగుదొడ్డిని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే ముంబయి మెట్రో తీసుకొచ్చిన కొత్త నిబంధన చర్చనీయాంశం అయింది. మెట్రోలో ప్రయాణించేవారు టాయిలెట్ కు వెళ్లాలంటే టాయిలెట్ పాస్ తప్పనిసరిగా నింపాల్సిందేనని కండీషన్ పెట్టింది.
గతంలోనూ గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో 2012లో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికిపై ఎలాంటి సమాచారం లేదు.
ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వెహికల్స్‌కు టోల్‌ను మినహాయిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (అక్టోబర్ 14) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఈ చట్టం ప్రకారం ముంబైలోకి ప్రవేశించే కార్లు, ఎస్‌యూవీలకు మాత్రమే ఈ టోల్ మినహాయింపు లభిస్తుంది.
మహారాష్ట్రలోని అధికార మహయుతి ప్రభుత్వంపై విపక్ష మహా వికాస్ అఘాడి ఆదివారంనాడు విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, అవినీతి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆక్షేపణ తెలిపింది.
ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కొద్ది గంటలకే ఆయనను తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ప్రకటించింది. దీంతో బాబా సిద్ధిఖి హత్యకు బాలీవుడ్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉండటం ఒక కారణం కావచ్చా అనే కొత్త కోణం కూడా వెలుగుచూసింది.
ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధిఖీని తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ముంబై: ఎన్సీపీ (NCP) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి (Baba Siddique) హత్య పక్కా ప్లానింగ్‌తోనే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాంట్రాక్ట్ హత్య కావచ్చునా, వ్యాపారంలో శత్రుత్వమే కారణమా, స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కారణంగానే ఆయనను హంతకులు మట్టుబెట్టారా అనే పలు కోణాల నుంచి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆదివారం తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ హత్య ఘటనతో మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. ఈ హత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.