Home » Mancherial
దసరా వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం పలు ఆలయాలను సందర్శించారు. అనంతరం జమ్మి పూజలో పాల్గొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలుచోట్ల రాంలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంలీల కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపారు. పలు ఆలయాలు, దుర్గ మండపాల వద్ద వాహన పూజలు నిర్వహించారు.
చెన్నూరు నియో జకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరు గుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలి పారు. శనివారం సింగరేణి పాఠశాల మైదానంలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాంలీల కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు.
జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపులేకుండా పోతోంది. ఓ వైపు మున్సిపల్ అధి కారులు అక్రమ కట్టడాలపై కొరఢా ఝళిపిస్తుండగా, మరోవైపు నిబంధన లకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమ నార్హం.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డీవో కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏ రకం ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300లు మద్దతు ధర చెల్లించాలన్నారు.
చెన్నూరు పట్టణంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహి ళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజా మునే తీరొక్క పూలను సేకరించిన మహిళలు బతు కమ్మలను పేర్చి స్ధానిక ఆలయాల్లో బతుకమ్మ ఆడా రు.
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సర్చ్ నిర్వహిస్తున్నామని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ట్యాంకు బస్తీలో పోలీసు సిబ్బంది, నార్కోటిక్ డాగ్ ఫోర్స్‌తో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాల న్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేతను తాము వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కమీషన్‌కు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అని, గడిచిన 8 నెలల్లో ఆయన ఎంత కమీషన్ తీసుకున్నాడో మా దగ్గర చిట్టా ఉందన్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం లభించడం లేదు. ఈనెల 2వ తేదీ నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు.
సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధుల కల సాకారం కానుంది. వారం రోజుల క్రితం డీఎస్సీ ఫలితాలతో జిల్లా అభ్యర్ధులు ఆనందంలో మునిగిపోయారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సంబంధిత జిల్లా అధికారులు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు.
జిల్లాలో షెడ్యూల్డు తెగల ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జెడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాంలతో కలిసి సమావేశం నిర్వహించారు.