Home » MS Dhoni
మహేంద్రసింగ్ ధోని కోరిక మేరకే 2011 వన్డే ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదని టీమిండియా మాజీ సెలెక్టర్ రాజా వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది.
తొలి నాళ్లలో ధోని భారత జట్టుకు ఎలా ఎంపికయ్యాడనే విషయాలను నాటి బీసీసీఐ సెలెక్టర్ సబా కరీమ్ తెలిపాడు. ముఖ్యంగా 2004 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా నాటి టీమిండియా కెప్టెన్ గంగూలీకి ధోని గురించి చెప్పినట్లు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తూ నాటి పాక్ పర్యటనకు ధోని ఎంపిక కాలేదు. అయితే దీనికి గల ఆసక్తికర కారణాలను సబా కరీమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా గెలిచిన అత్యధిక మ్యాచ్‌ల్లో జట్టులో సభ్యుడిగా ఉన్న రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటివరకు టెస్టుల్లో 250 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఎక్కువ సార్లు ఛేదించిన టీమ్ కెప్టెన్‌గా రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ నేతృత్వంలో టీమిండియా నాలుగు సార్లు 250కి పైగా టార్గెట్లను ఛేదించి విజయాలు కైవసం చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాపై 251 పరుగుల టార్గెట్‌ను బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ అధిగమించి గెలిచింది. అయితే స్టో్క్స్ కెప్టెన్‌గా 250 రన్స్‌కు పైగా టార్గెట్లను ఛేదించడం ఇంగ్లండ్‌కు ఇది ఐదోసారి. దీంతో ధోనీ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ అధిగమించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా జరుపుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా తన పెంపుడు కుక్కలతో ధోనీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
అనేక మంది అభిమానులు ధోని పుట్టిన రోజును పురస్కరించుకుని భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నేపాల్ దేశంలో (Dhoni Nepal Fans) ఉన్న ధోని అభిమానులు మహీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారీ ఎత్తున పాల్గొన్న అభిమానులు ధోని పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
మహేంద్రసింగ్ ధోనీ(Mahendra singh Dhoni). క్రికెట్లోకి (Cricket) అడుగుపెట్టక ముందు ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి. కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్లో టీసీగా(Ticket collector) పని చేశాడు. కుటుంబంతో ఒక అద్దె గదిలో నివాసం ఉన్నాడు. కానీ క్రికెట్ మహేంద్రుడి జీవితాన్ని మార్చేసింది. పేరు ప్రఖ్యాతలతోపాటు వందల కోట్లకు అధిపతిని చేసింది. సరైన టాలెంట్ ఉండి, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల బలంగా ఉంటే ఒక మనిషి జీవితంలో ఏ స్థాయికి ఎదగగలడనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ధోని.
ఫీల్డింగ్‌లో ధోనీ మిస్టర్ పర్ఫెక్ట్. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ పెళ్లికి ముందు ధోనీ అనేక మంది బాలీవుడ్ హీరోయిన్లతో లవ్ అఫైర్ నడిపాడన్న రూమర్లు వినిపించాయి. ఈ జాబితాలో దీపికా పదుకునే, అశిన్, లక్ష్మీరాయ్ ఉన్నారు
ధోనీ ఈరోజు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రాంచీలో ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన అతడు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నాడు. ఆటతీరుతో, వ్యక్తిత్వంతో అందరికీ మార్గదర్శకుడిగా మారాడు. ప్రస్తుతం ధోనీ ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.