Home » NCP
వర్షం పడితే మనమంతా ఏం చేస్తాం? వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగులు పట్టడమో లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడమో చేస్తాం. కానీ.. 82 ఏళ్ల వయసున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మాత్రం..
మరాఠా సీనియర్ నేత, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఓబీసీ వర్గానికి చెందినట్టు ఒక డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆయన మంగళవారంనాడు స్పందించారు. కులాన్ని దాచిపెట్టాల్సిన అవసరం తనకు లేదని, తాను ఎన్నడూ కుల రాజకీయాలకు పాల్పడలేదని సమాధానమిచ్చారు.
మహారాష్ట్రలో తమ పార్టీ బీజేపీ తో చేతులు కలిపే ప్రసక్తే లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గంతో బీజేపీ చేతులు కలపడానికి కారణం ఏమిటో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అజిత్ పవార్ వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేయాలని కోరుకోవడంతో ఆ వర్గాన్ని కలుపుకొని వెళ్లామని చెప్పారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వివాదం భారత ఎన్నికల కమిషన్ ముందు విచారణకు వస్తోంది. దీనిపై ఈనెల 6వ తేదీన తన వాదనను ఈసీఐ ముందు ఉంచనున్నట్టు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారంనాడు తెలిపారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో కానీ, ఆర్థిక మంత్రిగా కానీ తాను ఎంతకాలం కొనసాగుతానో చెప్పలేనని అన్నారు.
మహారాష్ట్రలోని అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం మధ్య చిచ్చు చల్లారడం లేదు. తాజాగా, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నార్వేకర్‌కు లేఖ రాసింది. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది.
ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ముంబై సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది.
మరాఠా రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మాటల్లో అంతరార్థం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆయన ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో తెలియడం లేదు. తన సమీప బంధువు అజిత్ పవార్ పార్టీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ, తన పార్టీలో చీలిక లేదని చెప్తున్నారు.
లక్షద్వీప్ లోక్ సభ సభ్యుడు, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ (Mohammed Faizal)కు సుప్రీంకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయన దోషి అని క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది.