Home » Pithapuram
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట నివాసముండేందుకు ఇల్లు చూసుకుంటా.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ఏర్పాటు చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్ర పోషించారని విజయవాడ వెస్ట్ బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdary) అన్నారు. మంగళవారం నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను సుజనా చౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు పిఠాపురంలో చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్.. ‘నన్ను కలవడానికి ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు.. అందులో కొందరు కిరాయిమూకలు సన్న బ్లేడ్లతో వస్తున్నారు. వారు సన్న బ్లేడ్లు తెచ్చి నన్ను, నా సెక్యూరిటీని కోస్తున్నారు...
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రెండోరోజు ఆదివారం పిఠాపురంలో కొనసాగుతోంది. పిఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతికగా దేవి అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. మహారాష్ట్ర భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దత్తపీఠం దర్శనాన్ని రద్దు చేసుకున్నారు.
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు ఆదివారం పిఠాపురంలో పర్యటించనున్నారు. పాదగయ క్షేత్రంలో ఉదయం 11గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12 గంటలకు శ్రీ పాద శ్రీవల్లభ దత్తత్రేయుని దర్శించుకుని పూజలు చేయనున్నారు.
జగన్ (Jagan) అవినీతి, అక్రమాలు, అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నాయకులు వ్యక్తిగత దాడికి దిగుతూ.. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్మతో జనసేన ( Janasena ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు గంటపాటు చర్చించారు. నాలుగు రోజుల పవన్ పర్యటన షెడ్యూల్ పై మాట్లాడుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకి పురోహుతిక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. రేపు ఉదయం పిఠాపురం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు.
పిఠాపురంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. నేటి నుంచి పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చేబ్రోలులో మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.
పిఠాపురం.. ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హట్ టాపిక్.. రాజకీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటమే. నియోజక వర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పిఠాపురం నియోజక వర్గంలో 14 మంది ఎమ్మెల్యేలుగా పని చేశారు.