Home » Politics
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందిన విషయం విదితమే.
తెలంగాణలోనూ పునర్వైభవం సాధించాలని చూస్తున్న టీడీపీ ఈసారి పెద్ద నేతలనే రంగంలోకి దింపాలని చూస్తోంది. టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలను నారా బ్రాహ్మణి లేదంటే నారా లోకేష్‌కి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రచ్చ చేస్తోంది. పర్సనల్ వివాదాలు కాస్తా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అదే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ రిలేషన్షిప్. ఇంట్లో ప్రియురాలు.. ఆ పక్కింట్లో ఇల్లాలు అన్నట్లుగా ఉంది దువ్వాడ యవ్వారం.
లోక్ సభ సమావేశాలు వాయిదా పడ్డాక శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులుగా ఉన్న ప్రధాని మోదీ, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఒకే చోట చేరారు. చేరడమేకాదు ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకున్నారు.
సీపీఎం దిగ్గజ నేత, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (80) ఇకలేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు.
ప్రజల కష్టాలు తెలిసే నేత వాటి పరిష్కరించడానికి చూపే చొరవ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో అలాంటి వారు అరుదు. వారిలో వనపర్తి ఎమ్మెల్యే కూడా ఒకరు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Tudi Megha Reddy) ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు.
వైసీపీ(YSRCP) పాలనలో ఏపీ అప్పులపాలైందని తెలుగుదేశం(TDP) పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు విమర్శించారు. అప్పుల భారం రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. మంగళవారం ఆయన ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ చేసిన అప్పులను పునర్వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు.
వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సిద్ధమైంది. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఈడీ టార్గెట్ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బీజేపీకి సవాల్ విసిరారు.
ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్‌లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .