Home » Rains
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బీభత్సం సృష్టించిన వర్షాలు మళ్లీ వచ్చేశాయి. ఈ క్రమంలో రేపటి (అక్టోబర్ 4) నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
నీలగిరి(Neelagiri) జిల్లా కున్నూరు మౌంట్రోడ్ కృష్ణాపురం ప్రాంతంలో కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా సోమవారం వేకువజాము ఓ ఇంటి ముందు మట్టిపెళ్లలు పడటంతో ఓ ఉపాధ్యాయురాలు దుర్మరణం చెందారు. కున్నూరు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి కూడా కున్నూరు అంతటా భారీగా వర్షాలు కురిశాయి.
భాగ్యనగరంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం అయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు క్రమంగా వెనక్కి వస్తున్నాయి. అయినప్పటికీ నేడు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వర్షాల ప్రభావం ఎక్కడెక్కడ ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో వానలు కురుస్తాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ఏలేరు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. భారీ వానలకు జలాశయానికి గంటగంటకు వరద ఉద్ధృతి పెరుగుతోందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.భాస్కరరావు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో వర్షాలు ప్రధానంగా ఏయే రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉంది, ఎక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారనే విషయాలను ఇక్కడ చుద్దాం.
చాగలమర్రి మండలంలో బుధవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది.
తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.