Home » Rajasthan
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని వేధించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ ఉసిగొలుపుతోందని, రాష్ట్రంలో ఈడీ నిరంతర దాడులే కాంగ్రెస్ సాధించబోయే విజయాన్ని చెప్పకనే చెబుతున్నాయని విశ్లేషించారు.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల పోరులో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్లను...
కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు త్వరలోనే ఆ పార్టీని వీడబోతున్నారని రాజస్థాన్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ తెలిపారు. రాజస్థాన్‌లో బీజేపీ రెండవ జాబితా విడుదల చేసిన మరుసటి రోజే ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ నియమావళి ప్రకారం రూ.50 వేలకు మంచి నగదను తీసుకుని ప్రయాణం చేయకూడదు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.
ఈసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ తమ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను శనివారంనాడు విడుదల చేసింది. 83 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ) ఝల్రాపటన్ నుంచి పోటీ చేయనున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని అనుకుంటున్నానని, కానీ ఆ పదవి నన్ను విడిచిపెట్టడం లేదని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ని...
'నాయట్టు' అనే మలయాళ సినిమాను తెలుగులో శ్రీకాంత్ లీడ్ రోల్లో 'కోట బొమ్మాళి' అనే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అచ్చం ఈ సినిమా కథను పోలిన ఘటన ఒకటి తాజాగా రాజస్థాన్‌లో జరిగింది.
రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్ పరిధిలోని ఓ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు అక్కడ బయటపడిన వాటిని చూసి అవాక్కయ్యారు.
ఇంట్లో చిన్నారులుంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలియజేసే ఘటన ఒకటి తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur) లో వెలుగు చూసింది.