Home » Sabitha Indra Reddy
గ్రేటర్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ వేదికగా మెసేజ్ పెట్టారు. ‘‘భారీ వర్షాల కారణంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించారు.
రాష్ట్రంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల్లో పని చేస్తున్న వారిని రెన్యువల్ చేయకుండా, కొత్తగా నియామకాలు జరపాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ నిర్ణయించారు. ఈ మేరకు నియామక షెడ్యూల్ను ప్రకటించారు.
విద్యా యజ్ఞం, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మన నేతలు చెప్పే మాటలు నీటిమూటలేనని తేలింది. దేశంలోని చాలా ప్రాంతాలతో పోలిస్తే పాఠశాలల పనితీరులో తెలంగాణ చాలా వెనుకంజలో ఉంది. పాఠశాలల పని తీరు అంశంలో దేశంలోనే 31వ స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చే గ్రేడ్లలో కింది నుంచి రెండోదైన ‘ఆకాంక్షి2’కి పరిమితమైంది.
ఉపాధ్యాయ అర్హత పరీక్షను(టెట్) త్వరలోనే మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తరగతులు మొదలై నెలరోజులైంది. కానీ నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. బోధించేందుకు సరిపడా లెక్చరర్లు లేరు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. అటు ప్రైవేటు కళాశాలల్లో విద్యాబోధన వేగం పుంజుకోగా.. ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులు మాత్రం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ జూనియర్, మోడల్, కేజీబీవీ, గురుకుల జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో పోస్టుల భర్తీ కోసం పరీక్షల షెడ్యూల్ను ప్రకటించినా.. పలు అంశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఆగష్టు 1 నుంచి 22వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(ట్రిబ్).. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు(సీబీటీ) ఉంటాయని పేర్కొంది.
కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్లకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినా కోర్టు కేసులు అడ్డు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. పదోన్నతులు, బదిలీల కోసం ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి వస్తున్నా.. ఈ విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
వికారాబాద్ జిల్లాలో 436 మంది పోడు రైతులకు (farmers) 552 ఎకరాల భూమి పట్టాల పంపిణి చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహించారు.