Home » Schools
మండలకేంద్రంలోని జిల్లా పరిషత పాఠశాలలో 1991-92 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న స్నేహితలంతా కలిశారు. రోజంతా సంతోషంగా గడిపారు. గ్రామానికి చెందిన ఎనఆర్‌ఐ కేఆర్ ప్రవీణ్ స్థానిక జిల్లా పరిషత పరిగి పాఠశాలకు వచ్చాడు. ఈ విషయం తెసుకున్న ఆ పాఠశాలలో 1991-92 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న స్నేహితలందరూ అక్కడికి చేరుకున్నారు.
రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ నిడివి దాదాపు ఖరారైంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా 2 నిమిషాల 30 సెకన్ల నిడివికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు చరణాలు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సంగీత దర్శకుడు కీరవాణితో ఆదివారం ఆయన స్టూడియోలో భేటి అయ్యారు.
ద్యా సంవత్సరం ప్రారంభమైందంటే స్కూల్ బ్యాగ్స్‌పై చర్చ పెద్దఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల బరువు కంటే వారి పుస్తకాల బరువు ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో చిన్నారులకు వెన్నెముక సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా చేసిన పనులకు బిల్లులు రాక పడిగాపులు పడుతున్న కాంట్రాక్టర్ల అవస్థలివి. శిథిలావస్థకు చేరిన సర్కారు బడులను అభివృద్ధి చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పథకం పనులు చేసిన కాంట్రాక్టర్లు అప్పులపాలవుతున్నారు.
Andhrapradesh: ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదని.. విజ్ఞాన సమూపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోమవారం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట లాంటి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు.
‘‘మహిళల్లో ఋతుక్రమ సమస్యలు చాలా సున్నితమైన అంశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి గురించి ఇతరులతో మాట్లాడడం అపరాధంగా భావిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి మారాలనేది నా తపన. అందుకే నాకు చేతనైనది చేస్తున్నాను’’ అని చెబుతారు 35 ఏళ్ళ రాఖీ గంగ్వార్.
మణిపూర్(Manipur)లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షం(heavy rain), వడగళ్ల వాన కారణంగా పలు ఇళ్లు, అనేక వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంఫాల్ వెస్ట్‌లోని కాంచీపూర్, తేరాతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలో మే 6, మే 7న పాఠశాలలు(Schools), కళాశాలలు(colleges) బంద్ చేస్తున్నట్లు సీఎం ఎన్ బీరెన్ సింగ్(Biren Singh) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకున్నారంటే.. చిన్న పిల్లలన్న తర్వాత ఇదంతా సహజమని ఎవరైనా అంటారు. కానీ ఆ విద్యార్థులకే పాఠాలు చెప్పే టీచర్, ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఒకరినొకరు కొట్టుకుంటే.. దీనినే మనాలి.
పాఠశాలల్లో బాంబులు పెట్టామనే బెదిరింపు ఈమెయిళ్లతో ఢిల్లీలో బుధవారం కలకలం చెలరేగింది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనతో స్కూళ్లకు పరుగులు తీశారు.
బాంబు బెదిరింపుతో(Bomb Threat) దేశ రాజధానిలో 60కిపైగా పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.