Home » Schools
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కొందరు గురువులు దారి తప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తాగేసి బడికి వచ్చిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ(Uttarpradesh) ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
Telangana: స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు ఎంతో హుషారుగా ఆటల్లో మునిగితేలుతున్నారు. ఆ బాలుడు కూడా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. కానీ ఆ బంతే అతని పాలిట యమ పాశంగా మారుతుందని ఊహించలేదు. ఇదే బాలుడికి చివరి రోజని ముందే తెలిస్తే తల్లిదండ్రులు కూడా వెళ్లనిచ్చేవారు కారేమో. కానీ జరిగాల్సిన దారుణం జరిగిపోయింది.
చిరుత సంచరిస్తుండడంతో ఓ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆణిమేరిస్వర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. మైలాడుదురై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత(Cheetah)... అరియలూరు జిల్లా పొన్‌పరప్పి, సిదలవాడి ప్రాంతాల్లో తిరుగున్నట్లు గురువారం వార్తలు రావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మూడో తరగతి చదువుతున్న తన కుమారుడి స్కూల్ ఫీజు నెలకు రూ.30 వేలు అంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా అయితే బతికేదెలాగ అంటూ అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని దిల్లీ ( Delhi ) లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని ఆరో తరగతికి ప్రమోట్ చేయడానికి పాఠశాల నిరాకరించంది. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ ఒంటిపూట బడులు నిర్వహించనున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వహించనున్నారు.
ఈ నెలలో వరసగా మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు వచ్చాయి. 8వ తేదీన శివరాత్రి సందర్భంగా పాఠశాలలు మూసి ఉంటాయి. 9వతేదీన రెండో శనివారం వచ్చింది. 10వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. 11వ తేదీన సోమవారం తిరిగి స్కూళ్లను తెరుస్తారు.
Telangana Half Day Schools: మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు(Temperature) పెరిగిపోతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ(Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడుల(Half Day Schools) నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో బడులు ఒక్కపూట మాత్రమే ఉంటాయి.
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.