Home » Telangana Police
Telangana Crop Loan Waiver: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జులై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది.
Telangana: నగరంలో సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతికి చిక్కిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో.. ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో 7 గురు ఫెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు ఉన్నారు.
Telangana: హీరో రాజ్ తరుణ్‌కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగాల పేరుతో సైబరాబాద్ పరిధిలో భారీ మోసం జరిగింది. కిలారు సీతయ్య అనే వ్యక్తి పేరు మోసిన కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశాడు. ఆ నగదుతో ఆన్లైన్ గేమ్స్, ట్రేడింగ్, జల్సాలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అరెస్టు చేశారు.
Telangana: రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రాజేంద్రనగర్ డివిజన్లో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. అలాగే ఈకేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 1012 ... సెక్షన్ 22(సీ),27(ఏ),27(ఏ)29 ఆర్/డబ్ల్యూ, 8సీ ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.
Telangana: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలుగా యత్నిస్తున్నారు. అలాగే రాజారాం యాదవ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.
Telangana: సమాజంలో రోజు రోజుకూ నకిలీ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. ఆహార పదార్థాలను నకిలీ చేసి అమ్ముతున్న వారిపై పోలీసులు, ఫుడ్ స్టేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక చోట నకిలీలు తయారవుతూనే ఉన్నాయి.
నార్సింగి పోలీసుల(Narsingi police)కు తాను ఇచ్చిన ఫిర్యాదుపై అన్ని ఆధారాలూ సమర్పించినట్లు నటి లావణ్య(Actress Lavanya) వెల్లడించారు. 170కి పైగా ఫొటోలు, మెడికల్ రిపోర్టులు పోలీసులకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. నటి మాల్వి మల్హోత్రా(Malvi Malhotra)తోపాటు ఆమె సోదరుడిపై మొదటి ఫిర్యాదు చేశానని, నటుడు రాజ్ తరుణ్(Raj Tarun) తనను వాడుకొని మోసం చేశాడంటూ ఇవాళ(బుధవారం) ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ జరిగిన కేసును ఛేదించినట్లు రాజేంద్రనగర్(Rajendranagar) డీసీపీ శ్రీనివాస్(DCP Srinivas) వెల్లడించారు. ఈనెల 9న బాధితుడు కుటుంబంతో సహా వ్యక్తిగత పని నిమిత్తం విజయవాడకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు 24గంటల్లోనే కేసు ఛేదించి సొత్తును బాధితులకు అప్పగించారు.
సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటి మీద హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.