Home » Telangana Police
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy), ఆయన కుటుంబానికి చెందిన భూమిని నకిలీ పత్రాలతో కొట్టేందుకు కేటుగాళ్లు యత్నించారు. దీనికి సంబంధించిన కేసును జోగిపేట పోలీసులు(Jogipet Police) ఛేదించారు. భూమిని కాజేందుకు కుట్రలు పన్నిన నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు.
మొయినాబాద్(Moinabad)లోని ఓ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ(Mujra Party)ని ఎస్ఓటీ పోలీసులు(SOT police) భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.
Telangana: మియాపూర్ భూముల ఆక్రమాణల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో సర్వే నెంబర్ 100, 101లలో వేలాదిమంది ఆక్రమణలకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఖాకీలపైనే ఆక్రమణదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘‘ది కేవ్ పబ్’’ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో పట్టుబడిన 24 మందికి సీఆర్పీసీ 41కింద నోటీసులు జారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరుకావాల్సిందిగా రాయదుర్గం పోలీసులు ఆదేశించారు.
నగరంలోని మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఇప్పటికే పలు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో జూబ్లీహిల్స్(Jubilee Hills) సహా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాజాగా కేవ్ పబ్(Cave Pub)పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్, గంజాయిని గుర్తించారు. జాయింట్ ఆపరేషన్ చేపట్టిన సైబరాబాద్ ఎస్ఓటీ(SOT), టీజీ న్యాబ్(TG NAB) అధికారులు.. మత్తుపదార్థాలు సేవించిన 24మందిని అదుపులోకి తీసుకున్నారు.
సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. చిన్న, పెద్ద, ముసలి, ముతక అని లేడా లేకుండా మహిళలపై నిరంతరం అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్లలు పుట్టారంటేనే నిరంతరం కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
సైదాబాద్ పోలీస్ స్టేషన్ (Saidabad police station)లో దారుణ ఘటన వెలుగుచూసింది. న్యాయం చేయాలంటూ వెళ్లిన ఫిర్యాదుదారుడినే పోలీసులు చితకబాదారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో రాంసింగ్(Ramsingh) కుంటుంబం చిరువ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటోంది. రెండు నెలల క్రితం రాంసింగ్ భార్యకు పక్కింటి వాళ్లతో గొడవ జరిగింది. అదే రోజు రాత్రి ఆమె మృతిచెందడంతో స్టేషన్కు వెళ్లిన బాధితుడిని పోలీసులు చితకబాదారు.
తెలంగాణలో(Telangana) పలువురు ఖైదీలకు పండుగ రోజు నేడు. అవును.. మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదులు(Prisoners) విడుదలవుతున్నారు. అంతేకాదండోయ్.. వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది జైళ్ల శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది.
నగరంలోని పలు పబ్బులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇటీవల పలు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా నేపథ్యంలో పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
నగరంలో భవారియా గ్యాంగ్ (Bhawariya gang) మళ్లీ హల్చల్ చేస్తోంది. గంటల వ్యవధిలోనే పెద్దఎత్తున చైన్స్నాచింగ్(Chain snatching)లకు ముఠా పాల్పడింది. హైదరాబాద్ (Hyderabad)తోపాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్గా రెచ్చిపోతున్నారు. జవహర్నగర్, శామీర్పేట్, మెహిదీపట్నంలో వరస చైన్స్నాచింగ్లకు పాల్పడుతూ మహిళలను హడలెత్తిస్తున్నారు.