Home » Vote
పోలింగ్ స్టేషన్ కనుగొనేందుకు ఈ కింది సూచనలు పాటించండి. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ తీసుకుంటే బెటర్. దాని ఆధారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొచ్చు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశాల నుంచి తెలుగు వారు తరలివస్తున్నారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుంటున్నారు. షార్జా నుంచి 100 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేసేందుకు ఆంధ్రాకు వచ్చారు. షార్జా, దుబాయ్ పలు ప్రదేశాల నుంచి ఓటు వేసేందుకు గన్నవరం ఎయిర్ట్‌కు ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలు(2024 Lok Sabha elections) ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని ప్రతి పౌరులు తమ రాజ్యాంగ హక్కు ప్రకారం ఓటు వేయాలి. కానీ ఓటరు జాబితాలో(voter list) మీ పేరు ఉన్నప్పటికీ, మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే, మీరు ఇతర 12 ఐడీ కార్డులలో దేని సహాయంతోనైనా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
లోక్ సభ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషుల కన్నా ఓటింగ్ శాతం అతివలదే నమోదవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళల ఓటింగ్ శాతం 0.16 ఎక్కువగా ఉంది. ఈ సారి అది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. అందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల కోసం వరాలు కురిపిస్తున్నాయి.
సహజంగా.. పెద్ద పండుగైన సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటుంది. ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లే క్రమంలో వాహనాలతో ఈ మార్గం కిటకిటలాడుతుంటుంది. కానీ, ఏ పండుగా లేకున్నా.. ఇప్పుడు అలాంటి సందడే కనిపిస్తోంది. ఓట్ల పండుగకు ఏపీ వాసులు సొంత ప్రాంతానికి పయనం కావడమే దీనికి కారణం.
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారు. ఒకరు ఓటరును గుర్తిస్తారు. మరొకరు సిరా చుక్క పెడుతుంటారు. ఈవీఎం పరిసరాల్లో మరొకరు ఉంటారు. వారి ఎదురుగా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కో పార్టీ తరఫున ఒకరు ఉంటారు. దొంగ ఓట్లు పడకుండా తగిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు మరో బాధ్యత కూడా ఉంటుంది.
ఓటు హక్కు ఉన్నప్పటికీ, చాలామంది వాటిని సద్వినియోగపరచుకోరు. పోలింగ్ డేను సెలవుగా ఎంజాయ్ చేస్తుంటారు. గంటల తరబడి సమాజం, ప్రభుత్వ పనితీరు, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతారు కానీ..
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్‌లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
ఓటు వేసేందుకే కాదు, ఐడీ ప్రూఫుల్లో ఒకటిగానూ ఓటర్ ఐడీ ఉపయోగపడుతుంది. అయితే దాన్ని అన్ని వేళలా జేబులో పెట్టుకుని తిరగడం సాధ్యం కాదు. అందుకే భారత ఎన్నికల సంఘం - డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు దిశగా కృషి చేసింది. 2021లో నేషనల్ ఓటర్స్ రోజున డిజిటల్ ఓటర్ ఐడీ(Voter Id)లను అందించింది. అయితే ఇప్పుడు ఎడిట్ చేయడానికి వీలు లేని పీడీఎఫ్ ఫార్మేట్లో స్మార్ట్‌ఫోన్ లేదంటే కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.