Home » Vote
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ కేతన గార్గ్ తెలిపారు. పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి అప్పగించే బాధ్యతలను రిటర్నింగ్ అధికారి, జేసీ ఆధ్వర్యంలో సమర్పించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌లో మీ ఓటును మీరు కాకుండా ఇతరులు ఎవరైనా వేసినట్లు గుర్తిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి (Electoral Commission) ఫిర్యాదు చేయండి. మీ ఓటుపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాఈసీకి తెలియజేయాలి. రేపు జరుగుతున్న పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య కీలక సూచనలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు (Lok Sabha Election 2024) మరికొన్ని గంటల సమయమే ఉంది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ పార్టీలకు ఓట్లు మళ్లేలా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది.
దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పేరు మీద ఎన్నికల సంఘం ఓటరు స్లిప్ ముద్రిస్తుంది. పోలింగ్ సమయానికి ఓ వారం రోజుల ముందే బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో)లద్వారా ఓటర్లు స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఈ ఓటరు స్లిప్ ఉండటం ద్వారా ఓటరు ఏ బూత్‌లో ఓటు వేయాలో.. ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా ఉంటుంది. దీంతో పోలింగ్ స్పీడ్‌గా జరుగుతుంది.
ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది పోలింగ్. ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే ప్రజలను పాలించే పాలకులు అవుతారు. ఈ పోలింగ్ రోజున ఎక్కువుగా వినిపించే పదం పోలింగ్ ఏజెంట్.. సాధారణంగా ఎన్నికల సిబ్బంది ఉంటారు. అదే సమయంలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఈ ఇద్దరికీ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరు ఎన్నికల సంఘం తరపున వారికి కేటాయించిన విధులు నిర్వర్తిస్తారు.
Telangana: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Andhrapradesh: ఓటు వేసేందుకు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో నిరీక్షిస్తున్నారు. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయని పరిస్థితి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది.
దేశంలో 2024 లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు(lok sabha 2024 elections) సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని 96 ఎంపీ స్థానాల కోసం పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అయితే అసలు ఓటు ఎలా వేయాలి, ఓటు వేసిన తర్వాత శబ్దం రాకపోతే(beep sound) ఏం చేయాలనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Andhrapradesh: ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ తీవ్రస్థాయిలో యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో డబ్బులు, నగదును రహస్యంగా పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే డబ్బుల విషయంలో పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. కొంతమందికి ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రచారానికి తెరబడగా.. ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.