Home » West Godavari
Andhrapradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక 24 గంటలుగా 6వేల మంది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుoటున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. అయితే మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రం ఎక్కడిక్కడ చెత్త నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.
Andhrapradesh: టీడీపీ ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా అడ్డంకులు సృష్టించడం అధికార పార్టీకి పరిపాటిగా మారిపోయినట్లు అనిపిస్తోంది. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించారనేది చెప్పనక్కర్లేదు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ సభలు నిర్వహించినా ఏదో ఒక రూపంలో అడ్డుకోవడం అనేది జరుగుతూనే ఉంది.
Andhrapradesh: జిల్లాలోని తిరువూరులో నిన్న(బుధవారం) టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువూరు సెక్టార్ 1 ఎస్సై సతీష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు 36 మంది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Andhrapradesh: జనసేన అధినత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి(గురువారం) నుంచి వారం రోజుల పాటు ఉభయగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటన కొనసాగనుంది. మూడు రోజుల పాటు కాకినాడ, మూడు రోజుల పాటు భీమవరంలో పవన్ పర్యటించనున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా జనసేనాధినేత దృష్టి సారించనున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 7న ఆచంటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సభా స్థలి ఏర్పాట్లపై టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు.
Andhrapradesh: జిల్లాలోని ఆకివీడులో ఘరానా మోసం జరిగింది. ఓ మహిళ షాపులలో బంగారు పూత వేసిన ఆభరణాలను మార్చి అసలైన బంగారు నగలను తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏలూరు: ద్వారకాతిరుమలలో శ్రీవారి గిరి ప్రదక్షిణ శుక్రవారం జరగనుంది. శేషాచల కొండ చుట్టూ 6 కి.మీ. మేర భక్తులు, గోవింద స్వాములు గిరిప్రదక్షిణ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు చిన వెంకన్న పాదాల వద్ద గిరిప్రదక్షిణ ప్రారంభంకానుంది.
Andhrapradesh: జిల్లాలోని పెనుగొండ మండలం విషాదం చోటు చేసుకుంది. సిద్ధాంతం బ్రిడ్జి నుంచి నూతన జంట గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఏలూరు జిల్లా: బుట్టాయూగుడెం మండలం, రాజానగరంలో విషాదం నెలకొంది. రాత్రి పాకలలో చలి మంట వేసుకొని ఉండగా గాలి వానకి పాక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పాకలో ఉన్న వెట్టి గంగ రాజు, జోడీ రాముడు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.