Home » YCP MP Avinash Reddy
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. శ్రీలక్ష్మిని త్వరలో సాధారణ వార్డుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
అవినాష్‌రెడ్డి హైడ్రామాపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు
వివేకా హత్య కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. కాగా.. నేడు ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది.
ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు తెలంగాణా హైకోర్టు (Telangana Highcourt)లో విచారణ జరగనుంది.
ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నారు. అరెస్ట్ చేయడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్‌కు ఎందుకు తీసుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఆరు సార్లు సీబీఐ విచారణకు వెళ్లానని చెప్పుకుంటున్నారని.. ఎన్ని సార్లు హాజరు కాలేదో కూడా సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా మంచిగా జీవించారని.. ప్రస్తుతం ఆయన పేరును గబ్బులేపుతున్నారని సీఎం జగన్ మేనత్త, వైఎస్సార్, వివేకానంద రెడ్డి సోదరి విమలారెడ్డి పేర్కొన్నారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని చూడడానికి హాస్పిటల్‌కు వచ్చిన విమలారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి మృత్యువు దగ్గరికి వెళ్లి వచ్చిందని.. ఆమెను చూసి ప్రార్థన చేయడానికి వచ్చానని తెలిపారు. చంపిన వాళ్ళు విచ్చల విడిగా తిరుగుతున్నారని.. తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారన్నారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకునే అజ్ఞాత వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్నారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఆలస్యం అవడం కూడా సీబీఐ వ్యూహాత్మక వ్యవహారమేనన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) నిజానిజాలేంటి..? పాత్రదారులెవరు..? సూత్రదారులెవరు..? అని తేల్చడానికి సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయగా.. ఒకట్రెండు అరెస్టులతో ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చేస్తుందని తెలుస్తోంది..
2019 ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మే 30 న జగన్ ప్రమాణం చేశారన్నారు. మేనిఫెస్టోను 98.5 శాతం అమలు చేశారన్నారు. ఈ నాలుగు ఏళ్లలో ఈ రాష్ట్రంలో జగన్ మంచి పాలనను అందచేశారన్నారు. ఒక పక్క పాలన వికేంద్రకరణకు సైతం కృషి చేశారన్నారు. అవినీతికి వ్యతరేకంగా పేదలకు అనుకూలంగా పాలన సాగుతోందన్నారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సీబీఐకు డీజీపీ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నిస్తున్నారు.