Home » YS Sharmila
దాయాదుల మధ్య ఆస్తుల గొడవల గురించి విన్నాం! ఆస్తుల కోసం అన్నదమ్ములు గొడవలు పడటం విన్నాం! భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడమూ సర్వ సాధారణం! కానీ... ఏకంగా తల్లి, చెల్లిపైనే కేసులు వేయడం మాత్రం అత్యంత అసాధారణం! మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్
సొంత అన్నా చెల్లెలు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య రాజకీయ వైరమే కాదు.. ఆస్తి తగదాలు సైతం ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కన్న తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా సొదరికి ఆస్తిలో వాటా ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట తప్పారు.
తోబుట్టువులైన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య వ్యక్తిగత వివాదానికి సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెల్లి, తల్లితో రాజీ కోరుతూ సెప్టెంబర్ నెలలో జగన్ లేఖ రాశారు.
జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డి, తన తల్లి వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డితో పాటు జనార్థన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్ ఫిల్ చేయగా, సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు..
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,500 కోట్ల బకాయి పెట్టేందుకు సిగ్గులేదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని మోదీ వారసుడు జగన్ తిరిగారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు వైఎస్సార్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటేనని విమర్శించారు.
అధికారం కోల్పోయిన తర్వాత.. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటూ ఎంతో మంది సొంత పార్టీ నాయకులే హితవు పలికారు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహారించాలని, సోదరి షర్మిలతో వివాదం మంచిదికాదని.. ఎన్నికలకు ముందు జగన్‌కు సన్నిహితులు చెప్పినా.. ఆయన మాత్రం ససేమిరా అన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత..
Andhrapradesh: విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో షర్మిల ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో టిక్కెట్ కొని.. ఉచితం ఎప్పుడిస్తారు అంటూ సర్కార్‌కు సూటి ప్రశ్న వేశారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పీసీసీ చీప్ పోస్ట్ కార్డు రాశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు పథకాల పేరుతో మభ్యపెట్టి.. అధికారం చేపట్టాక ఆ హామీలను అమలు చేయడం లేదన్నారు. గురువారం విజయవాడలో మీడియాతో..
ప్రధాని నరేంద్ర మోదీది పచ్చకామెర్లోడి తీరంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి విమర్శించారు. దేశంలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోందని గురువారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కులమతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఆరోపించారు.