Home » YSRTP
లోటస్‌పాండ్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదంటూ శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈరోజు (శుక్రవారం) గజ్వేల్ నియోజకవర్గంలో షర్మిల పర్యటించనున్నారు. అయితే గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. కాంగ్రెస్‌లో విలీనానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏక్షణమైనా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారత పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్‌లో చేరింది. షర్మిల చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
అవును.. వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలు దాదాపు కొలిక్కివచ్చేశాయ్!. రెండ్రోజుల పాటు ఢిల్లీలో పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల (YS Sharmila) వరుస భేటీలతో బిజిబిజీగా గడిపారు. గురు, శుక్రవారం రెండ్రోజులు హస్తినలో ఉన్న ఆమె.. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకున్నారు..
వైఎస్ షర్మిల(YS Sharmila) తన పార్టీని కాంగ్రెస్(Congress)లో విలీనం చేస్తే వైసీపీ(YCP)కి ఏపీ(AP)లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(YCP rebel MP Raghurama Krishnaraju) అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో చేరేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండానే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి సమయం ఆసన్నమైందా..? అతి త్వరలోనే విలీన ప్రక్రియ ముగియనుందా..? ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ కాబోతున్నారా..? రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే (New Delhi)పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నారా..? అంటే తాజా పరిస్థితులు, జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది..
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖర్ రావుకు అసెంబ్లీ అంటే ఎందుకు భయమని ప్రశ్నించారు.