Home » YSRTP
: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై (CM KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ బిడ్డలకు లేదని బీఆర్ఎస్ సర్కారుపై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొర తాలిబాన్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణే లేదని, కంటికి కనపడకుండా పోతున్నా పట్టింపే లేదని అన్నారు. బతుకమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయం అవుతుంటే దొర ఫామ్ హౌజ్‌లో మొద్దు నిద్ర పోతున్నడని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
అధికార పార్టీపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ అంశంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియా ద్వారా ఆవేదన చెందారు. ఈ మేరకు ఆమె ఓ నోట్‌ను పోస్ట్ చేశారు.
వైఎస్ జయంతి సందర్భంగా సందేహాలను పటాపంచలు చేస్తూ ఒక పరిణామం చోటుచేసుకుంది. నేడు (జూలై 8, 2023, శనివారం) వైఎస్‌ఆర్ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ పరిణామంతో మొత్తానికో క్లారిటీ వచ్చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాజకీయాలు కాస్త తాడేపల్లి ప్యాలెస్‌కు (Tadepalli Palace) చేరాయి. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో ఖమ్మం ‘జనగర్జన’ వేదికగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పార్టీలో చేరిన విషయం తెలిసిందే..
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్.. ఏపీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నతో విబేధించి తెలంగాణాలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటున్న షర్మిలకు కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మంచి జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆ ఊపు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా మొదలైంది. ఇందుకు జూపల్లి, పొంగులేటి లాంటి పెద్ద లీడర్లు హస్తం గూటికి చేరడమే కారణం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) విమర్శలు గుప్పించారు.