Home » Telangana » Rangareddy
రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వారి పట్టా భూములను ఫ్యూచర్ సిటీ కొరకు రోడ్డు వేసేందుకు అఽధికారులు భూసేకరణ సర్వే చేయడం ఏమిటని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు రైతుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తాము ఊరుకునేది లేదని తెలిపారు.
షాద్నగర్ పట్టణం నుంచి చించోడు- అయ్యవారిపల్లి వెళ్లే రోడ్డు వెంట ఉన్న మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి రోడ్డు విస్తరణ చేయకపోవడంతో మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆమనగల్లు పట్టణంలోని కల్వకుర్తి రోడ్డులో గల శ్రీనివాస్ వైన్షా్పలో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై వెంకటేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైంది. మనుషులు కనబడితే చాలు మీద దునుకుతూ దాడి చేస్తున్నాయి. మనుషులు లేని సమయాల్లో ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను తీసుకెళ్లి రోడ్లపై పడేస్తున్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు జిల్లాలో సజావుగా జరిగాయి. మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, హయత్నగర్, సరూర్నగర్, అబ్ధుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో సుమారు 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బోడంపహాడ్లో చోటుచేసుకుంది. బాధితురాలు కారు సువర్ణ తెలిపిన వివరాల మేరకు.. గ్రామ సమీపంలో శనివారం సువర్ణ ఆవును మేపుతోంది.
మండల పరిధిలోని నందివనపర్తిలో ఆదివారం సాయంత్రం పెట్రోమొబైల్ పోలీసులు ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.
మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద పెద్ద రథోత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు.
మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు కనుల పండవగా కొనసాగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు పచ్చటి తోరణాలు రంగురంగుల పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచేకాక పొరుగు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలను పర్మినెంట్ చేసేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ. యూసుఫ్ పిలుపునిచ్చారు.