Home » Telangana » Rangareddy
జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్కూటీతో సహా చెరువులోకి దూసుకెళ్లిన ఓ వ్యక్తి మూడు నాలుగు రోజుల కిందట మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం 22రోజుల తర్వాత లభ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని చెన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మంచాల మండల పరిధిలోని బుగ్గక్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.
లక్షలు ఖర్చుపెట్టి జిల్లాలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు వృథాగా మారాయని దిశ కమిటీ చైర్మన్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్-3 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సమీకృత మార్కెట్ యార్డు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్లలో పూర్తి కావల్సిన పనులు మూడేళ్లయినా ముందుకు సాగడం లేదు. కూరగాయలు, పండ్లు, మాసం ఇలా.. అన్నీ ఒకేచోట విక్రయాలు సాగేలా అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శంకర్పల్లి మున్సిపల్లో సమీకృత మార్కెట్ యార్డు పనులను ప్రారంభించింది.
మండలంలోని గుడితండా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్చ కాంగ్రెస్ మండలాధ్యక్షులు భట్టు కిషన్‌రెడ్డి, సూదిని శ్రీనివా్‌సరెడ్డి, గుడితండా మాజీ సర్పంచ్ సురే్‌షలు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు.
లగచర్ల గిరిజనులపై రేవంత్ సర్కార్ అక్రమంగా, కుట్రపూరితంగా పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, కడ్తాల మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. రిమాండ్‌కు తరలించిన గిరిజనులను వెంటనే విడుదల చేయకపోతే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండు వేల మంది గిరిజనులతో కొడంగల్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఫరూఖ్‌నగర్ మండలశాఖ అధ్యక్షుడు వెంకటే్‌షయాదవ్ అధ్యక్షతన శనివారం స్థానిక ఏబీ కాంప్లెక్‌లో ఫరూఖ్‌నగర్ మండల సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం జరిగింది.
రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.