Home » Telangana » Rangareddy
మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా ట్రాన్స్‌కో అధికారులు చెట్లకొమ్మలు నరికి వేయిస్తున్నారు. ఐదేళ్ల క్రితం విద్యుత్ వైర్ల కింద ప్రజాప్రతినిధులు, విద్యార్థులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అవి నేడు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం దక్షిణకాశీగా పిలువబడే బుగ్గరామలింగేశ్వర క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి ప్రారంభమైంది.
ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు కోల్పోయినన ప్రతీ రైతుకు తగిన న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్) అన్నారు. శుక్రవారం జెన్నాయిగూడ, రావిరాల గ్రామాల రైతులు తుక్కుగూడలోని కేఎల్లార్ కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు.
గిరిజన సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్మే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు.
కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక పౌర్ణమి మొదలు కార్తీక శష్టి వరకు ఆరు రోజుల పాటు కనుల పండువగా ఉత్సవాలు కొనసాగుతాయి
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.
తల్లి సంవత్సరీకం కోసమని వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. శంకర్పల్లి సీఐ శ్రీనివా్‌సగౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లికి చెందిన శేఖర్(40) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్మాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు అంతా కూడా పాలు పంచుకుంటున్నారు. అయితే మేడ్చల్‌లో సమగ్ర సర్వే పత్రాలు రోడ్డుపై కనిపించడం అవాక్కయ్యేలా చేస్తోంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఎన్యుమేటర్ల వద్ద ఉన్న ఫాంలు ...
కొడంగల్‌కు మంజూరైన నర్సింగ్ కళాశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు.
తాండూరులో రూ.7.50కోట్ల వ్యయంతో తలపెట్టిన ఇంట్రిగేటెడ్ (సమీకృత) మార్కెట్‌యార్డును పిల్లర్లు కట్టి వదిలేశారు. ఏడాది కాలంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.