Abn logo
Apr 7 2021 @ 15:45PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన విధాన నిర్ణయం బ్యాంకింగ్‌ షేర్లకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. అలాగే కోవిడ్-19 తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లుకు భరోసానిచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం) లాభాలతో ముగిశాయి. 49,277 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడి 49,661 వద్ద రోజును ముగించింది. ఇక, 14,716 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 14,819 వద్ద రోజును ముగించింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లాభాలను ఆర్జించాయి. అదానీ పోర్ట్స్, యూపీఎల్, టైటాన్ కంపెనీ, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ నష్టాలను చవిచూశాయి. 

Advertisement
Advertisement
Advertisement