Abn logo
Jun 21 2021 @ 06:49AM

పరేడ్ చూస్తున్న ప్రజలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. అమెరికాలో ఒకరు మృతి

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. దక్షిణ ఫ్లోరిడాలో జరుగుతున్న ప్రైడ్ పరేడ్‌ను ఉత్సాహంగా వీక్షిస్తున్న ప్రేక్షకులపైకి ఒక ట్రక్కు దూసుకెళ్లింది. ఇక్కడ ప్రైడ్ పరేడ్‌ను చూడటానికి పెద్ద ఎత్తున్న ప్రజలు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ రోడ్డుపై ఉన్న ట్రక్కును ముందుకు తీసుకెళ్లాలని డ్రైవర్‌ను అధికారులు అడిగారట. అంతే ఆ ట్రక్కు డ్రైవర్ వెంటనే వేగం పెంచి నేరుగా పరేడ్‌ను వీక్షిస్తున్న ప్రజలపైకి ట్రక్కును తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సదరు పికప్ ట్రక్కు డ్రైవర్ ఎందుకలా ప్రవర్తించిందీ తెలియదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.