Abn logo
Aug 3 2021 @ 23:15PM

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా

కులకచర్ల: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

  • పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి


పరిగి: పేదలకు సీఎం సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లో 66మంది లబ్ధిదారులకు మంజూరైన  రూ.22లక్షలా 12వేలా 400 విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ మనోహార్‌రెడ్డి, దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీపీలు అరవింద్‌రావు, మల్లేశం, సత్తమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు. 

జడ్జిలుగా ఎంపికైన వారికి ఎమ్మెల్యే సన్మానం 

పూడూరు/దోమ: జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా ఎంపికైన మండల కేంద్రానికి చెందిన తేజశ్రీరెడ్డి. దోమ మండల కేంద్రానికి చెందిన ఉమర్‌లను మంగళవారం పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి వారి ఇళ్లకు వెళ్లి శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాలప్రభాకర్‌గుప్త, సర్పంచ్‌ నవ్యనరసింహారెడ్డి, ఉపసర్పంచ్‌ రాజేందర్‌, జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్‌ఎంపీపీ మల్లేశం, సర్పంచ్‌ రాజిరెడ్డి, నాయకులు లక్ష్మయ్య, రాజగోపాలచారి పాల్గొన్నారు. 

కులకచర్లలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం 

కులకచర్ల: రైతులకు రూ.50వేల చొప్పున రుణమాఫీ చేయనున్న సందర్భంగా మంగళవారం కులకచర్లలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మనోహార్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి మంగళవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్తెమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠాపనలు 

మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామంలో కొత్తగా నిర్మించిన దేవాలయాల్లో మైసమ్మ, పోచమ్మ దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన  మంగళవారం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహార్‌రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.