Abn logo
Aug 3 2021 @ 23:16PM

లీకేజీలను వెంటనే మరమ్మతు చేయాలి

బార్వాద్‌తండా వాసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌

బంట్వారం (కోట్‌పల్లి): మిషన్‌ భగీరథ పైప్‌ లీకేజీలకు వెంటనే మరమ్మతు చేయాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన కోట్‌పల్లి మండలంలోని బార్వాద్‌తండా, మద్గుల్‌తండా గ్రామాలలో పర్యటించి గ్రామ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పైప్‌లైన్‌ కాంక్రీట్‌తో కప్పి కనిపించకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు మధ్యలో ఉన్న మట్టికుప్పను తీసి రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులకు తగు సూచనలు చేశారు. గత పర్యటనలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో నూతన విద్యుత్‌ స్తంభాలు వేయించి ఇబ్బంది లేకుండా చేశారని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆషాఢమాసం సందర్భంగా బంట్వారం మండలంలోని యాచారం గ్రామంలో నిర్వహిస్తున్న బోనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్‌ పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, అనిల్‌, వెంకటేషం, యాచారం సర్పంచ్‌ బల్వంత్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శరణారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే  నివాళులర్పించారు.