Abn logo
Aug 3 2021 @ 23:18PM

కిషన్‌రెడ్డిని కలిసిన నాయకులు

మేడ్చల్‌:కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి/మేడ్చల్‌/కీసర/ఘట్‌కేసర్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు బీజేపీ నాయకులు మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని బీజేపీ జిల్లా నాయకులు మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎన్నికైన కిషన్‌రెడ్డిని ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, హెచ్‌ఏఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మల్లారెడ్డితోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ది శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శులు  తిరుమల్‌రెడ్డి, కూరపాటి విజయకుమార్‌, దుండిగల్‌ విఘ్నేశర్‌, మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, హైమారెడ్డి, విజయలక్ష్మి, పవన్‌రెడ్డి మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అలాగే గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని రైల్వే అండర్‌పాస్‌ కోసం మంత్రి కిషన్‌రెడ్డిని మేడ్చల్‌ బీజేపీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గుండ ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలో లక్ష్మీనారాయణస్వామి గుడి, కేవీ రెడ్డినగర్‌, అంతం పిల్ల, మైపి, ప్రిస్టేజ్‌ పార్క్‌ కాలనీవాసులు గుండ్లపోచంపల్లికి రావడానికి మధ్యలో రైల్వే లైన్‌ ఉన్నందున ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి కృష్ణాగౌడ్‌, కౌన్సిలర్లు సరస్వతీమోహన్‌రెడ్డి, హంసకృష్ణాగౌడ్‌ ఉన్నారు. కీసర మండల పరిధి చీర్యాల్‌ సర్పంచ్‌ ధర్మేందర్‌, ఉపసర్పంచ్‌ తిరుమల్‌రెడ్డి మంగళవారం కిషన్‌రెడ్డిని కలిసి చీర్యాల్‌లో ‘డ్వాక్రా’ భవనం కోసం స్థలం కేటాయించి, రూ.25లక్షల నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. అలాగే ఘట్‌కేసర్‌కు చెందిన బీజేపీ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు విప్పర్ల హనుమాన్‌. ప్రవీణ్‌రావు మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసినట్లు తెలిపారు.