Abn logo
Aug 10 2020 @ 03:43AM

చైర్మన్‌ ఎన్నికే ప్రధాన అజెండా..!

నేడు ఐసీసీ బోర్డు సమావేశం

దుబాయ్‌: చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి నామినేషన్‌ ప్రక్రియపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బోర్డు సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఎన్నిక జరిగినా లేదా ఏకగ్రీవమైనా..మొత్తం కార్యక్రమాన్ని నాలుగు వారాల్లో ముగించాలని భావిస్తోంది. చైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం ముగియడంతో గతనెలలో ఆయన తప్పుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత తాత్కాలిక చైర్మన్‌, సింగపూర్‌కు చెందిన ఇమ్రాన్‌ ఖవాజా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్‌, వెస్టిండీస్‌ క్రికెట్‌ మాజీచీఫ్‌ డేవ్‌ కామెరూన్‌ పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. వీరితోపాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పోటీ పడే విషయం ఆసక్తి కరంగా మారింది. కామెరూన్‌ను విండీస్‌ క్రికెట్‌ బోర్డు వ్యతిరేకిస్తోంది. క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ ఏ) అధ్యక్షుడు క్రిస్‌ నెంజానీ కూడా పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు గంగూలీ పోటీకి దిగితే తాను మద్దతు ఇస్తానని సీఎస్‌ఏ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ ప్రకటించడం నెంజానీకి నచ్చలేదు. 

Advertisement
Advertisement
Advertisement