Abn logo
Oct 20 2020 @ 03:48AM

మన్యం సమస్యలను పట్టించుకోవడంలేదు

Kaakateeya

రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ మాధవ్‌ ధ్వజం

పాడేరురూరల్‌, అక్టోబరు, 19: మన్యం సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, దీంతో గిరిజనులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీజేపీ అరకు జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు ఆఽధ్యక్షతన సోమవారం నిర్వహించిన ర్యాలీ, ఐటీడీఏ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటిందని, మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఒక్కసారి కూడా నిర్వహించలేదని అన్నారు.

గిరిజన విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్న బెస్టు అవైలబుల్‌ స్కూళ్ల పథకాన్ని కొనసాగించాలని, ఏజెన్సీలో అన్నిశాఖల ఉద్యోగాలను స్థానిక గిరిజన నిరుద్యోగులతో భర్తీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హౌసింగ్‌ స్కీం ద్వారా గిరిజనులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడి వేణుగోపాల్‌, లోకుల గాంధీ, మఠం శాంతకుమారి, కురుసా ఉమామహేశ్వరరావు, కూడా కృష్ణారావు, కురుసా రాజారావు, సల్లా రామకృష్ణ, ఎన్‌.ఉమమహేశ్‌, కె.చిన్నయ్య, పి.రవికుమార్‌, వేమనబాబు, రామచందూర్‌, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


Advertisement
Advertisement