సత్తుపల్లి, ఫిబ్రవరి 6:మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గ్రంథాలయం విజ్ఞాన సమాహారమని, పుస్తక పఠనంతోనే ప్రగతికి బాటలు పడతాయని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని తుంబూరులో నూతనంగా ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. రిటైర్డ్ ఐబీ అధికారి చీకటి చిట్టీరావు తండ్రి సీతారామయ్య 12వ వర్ధంతి సందర్భంగా గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ పుస్తకాన్ని మించిన నేస్తం లేదని, గ్రామాల అభివృద్ధికి గ్రంథాలయాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, సర్పంచ్ మోదుగు నీలిమ, ఉప సర్పంచ్ మోరంపూడి శ్రీను, ఎంపీటీసీ నిమ్మగడ్డ కృష్ణకుమారి, గ్రామస్థులు వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, చిలుకుర్తి కృష్ణమూర్తి, సాంబశివరావు, జగన్, రాంబాబు పాల్గొన్నారు.