Abn logo
Sep 13 2021 @ 10:18AM

కృష్ణా జిల్లాలో నకిలీ విలేఖరి అరెస్ట్

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ పెదపారుపూడి మండలంలో నకిలీ విలేఖరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నపారుపూడి గ్రామానికి చెందిన వేమూరి విద్యాసాగర్...ప్రముఖ ఛానల్‌కు చెందిన(ఏబీఎన్ కాదు) నకిలీ ఐడెంటి కార్డుతో మండలంలో చలామణి అవుతున్నాడు. నకిలీ విలేకరిని గుర్తించి అరెస్ట్ చేసిన ఎస్ఐ రంజిత్ కుమార్ అతడిపై ఐపీఎస్ 417, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.