Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ వైఎస్ వారసుడు కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నారాయణస్వామి

చిత్తూరు: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఏం మాట్లాడినా సంచలమే. ఆ వ్యాఖ్యలతో ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏకంగా సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వారసుడిగా సీఎం జగన్ రాజకీయాల్లోకి రాలేదని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జనగ్ వైఎస్ వారసుడే కాదన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను చూసి కష్టపడి రాజకీయాల్లో నిలదొక్కుకున్నారని చెప్పారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్సుడు రాజకీయవర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. 

Advertisement
Advertisement