అంటువ్యాధులపై అప్రమత్తం కావాలి

ABN , First Publish Date - 2022-07-27T05:28:52+05:30 IST

ర్షాకాలం.. అందులో రెండు మూడు రోజులుగా వరుసగా ముసు రు వర్షం పడుతుండడంతో అంటువ్యాధులు ప్రబలేప్రమాదమున్నందున ప్రజా ప్రతినిధులు, అఽధికారులు అప్రమత్తమయ్యారు.

అంటువ్యాధులపై అప్రమత్తం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణ

- మండల కార్యాలయాల్లో స్థానిక అధికారులతో సమావేశాలు

- పది రోజులపాటు ఇల్లిల్లు తిరగాలని అధికారుల ఆదేశం

మహబూబ్‌నగర్‌/ అడ్డాకుల/ గండీడ్‌/ రాజాపూర్‌/ జడ్చర్ల/ బాలానగర్‌, జూలై 26 : వర్షాకాలం.. అందులో రెండు మూడు రోజులుగా వరుసగా ముసు రు వర్షం పడుతుండడంతో అంటువ్యాధులు ప్రబలేప్రమాదమున్నందున ప్రజా ప్రతినిధులు, అఽధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎక్కడికక్కడ మండల కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్య దర్శులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది, వీఆర్‌ఏలు, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి జట్లుగా ఏర్పడి పది రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి అవగాహన కలిగించాలని సూచించారు. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ మునిసిపాలిటీలలోనూ వివిధ శాఖల అఽధికారులతో సమావేశాలు జరిపారు.

పాలమూరు పురపాలిక పరిధిలో అన్ని వార్డుల్లో మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు ఇల్లిల్లు తిరుగుతూ అంటువ్యాధులు ప్రబల కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇళ్లల్లో ఉన్న నిలువ నీటిని పరిశీలిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహ న కల్పిస్తు న్నారు. నీటి సంపులు, తోట్లలో నీరు ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవద్దని సూచిస్తున్నారు. నీటిసంపు, తోట్లలో ఆంటీలార్వాలను వదులుతున్నారు. అపరిశు భ్రంగా ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లడం, దోమల స్ర్పే చేయడం వంటి చర్యలు చేస్తున్నారు. అదేవిధంగా పాత ఇళ్లలో ఎవరూ నివాసం ఉండరాదని సూచిస్తు న్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ వార్డుల్లో పశీలించారు. అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవ ర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ వార్డుల్లో తిరిగారు. మలేరియా, డెంగీ, టైపాయిడ్‌ వ్యాధులు రాకుండా దోమల నివారణకు చర్యలు తీసుకో వాలని సి బ్బందికి సూచనలు చేశారు. పారిశుధ్య పనులను మెరుగుపరచాలన్నారు. 

మంగళవారం పట్టణంలోని టౌన్‌హాల్‌లో మునిసిపల్‌ వార్డు ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లు, శానిటరి సిబ్బంది, వైద్యశాఖ సిబ్బంది ఏఎన్‌ఎంలు, ఆశాలు, అంగన్‌ వాడీలతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.కృష్ణ మాట్లాడారు. 

అడ్డాకుల మండల సమావేశ మందిరంలో ఆశ కార్యకర్తలకు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో  ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

గండీడ్‌ ఎంపీడీవో సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీవో రూపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ జ్యోతి, మహమ్మదాబాద్‌ ప్రత్యేక అధికారి చత్రునాయక్‌, మండల వైద్యాధికారి ముడావత్‌ రాహుల్‌, ఎంపీవో శంకర్‌ నాయక్‌, ఏపీవో హరిశ్చంద్రుడు, ఏపీఎం బాలకృష్ణ, వివిధ గ్రామాల పంచా యతీ కార్యదర్శులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

రాజాపూర్‌ రైతు వేదిక భవనంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు, అధి కారులకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి మధుసూదన్‌ రావు, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఏవో నరేందర్‌, ఎంపీవో రాములు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

జడ్చర్ల మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మునిసిపల్‌ వార్డు ఆఫీసర్‌లు, ఆర్పీలు, అంగన్‌వాడీ టీచర్స్‌, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌లత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, మునిసిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ పాలాదిసారిక, కమిషనర్‌ మహమూద్‌షేక్‌, డాక్టర్‌ సునీల్‌, కౌన్సిలర్లు రఘురాంగౌడ్‌, నందకిశోర్‌గౌడ్‌, చైతన్యచౌహాన్‌, శశికిరణ్‌, బుక్క మహేష్‌, కుమ్మరి రాజు, జ్యోతి, ఉమాదేవి, ప్రశాంత్‌రెడ్డి, రహీమొద్దీన్‌ పాల్గొన్నారు. 

సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి

సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు, చర్యలు చేపట్టాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య సూచించారు. జడ్చర్ల మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సీజనల్‌ వ్యాధులపై సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమాదేవి, మలేరియా జిల్లా అధికారి విజయ్‌కుమార్‌, గంగాపురం పీహెచ్‌సీ అధికారి డాక్టర్‌ సమత, ఏపీఎం మాల్యానాయక్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 

బాలానగర్‌ ఎంపీడీవో కృష్ణారావు ఎంపీడీవో కార్యాలయంలో సీజనల్‌ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మండల వైద్యాధికారి తులసి, ఏపీవో రాజశేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులు, అంగన్‌వాడీలు ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-27T05:28:52+05:30 IST