వైభవోపేతంగా అయ్యప్ప ఆభరణాల ఊరేగింపు

ABN , First Publish Date - 2022-01-14T05:30:00+05:30 IST

సదాశివపేటలోని అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్పసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మకరవిళ్ల వేడుకలను చూసేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

వైభవోపేతంగా  అయ్యప్ప ఆభరణాల ఊరేగింపు
సదాశివపేటలో అయ్యప్ప స్వామి ఆభరణాలు ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సదాశివపేట, జనవరి 14: సదాశివపేటలోని అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్పసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మకరవిళ్ల వేడుకలను చూసేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పట్టణ పురవీధుల గుండా అయ్యప్పస్వామి ఆభరణాల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. దీక్షాదారులు అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాలు ఉంచిన పెట్టెలను నెత్తిన ఎత్తుకుని ఆడిన పేటయి తుళ్లి ఆటలు, మహి ళల కోలాటం కనువిందు చేశాయి. ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లోడి జయమ్మ, వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, జిల్లా ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు , కౌన్సిలర్‌ పులిమామిడి రాజు, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, గుండు రవి, అయ్యప్పసేవా సమితి బాధ్యులు నాయుడు స్వామి, ఓదెల ప్రభుగుప్తా, గోనె శంకర్‌, సుధాకర్‌ గౌడ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మునిపల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కంది కృష్ణ, పలువురు పాల్గొన్నారు. 

సంగారెడ్డిలో..

సంగారెడ్డిరూరల్‌: సంగారెడ్డిలో మణికంఠ అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు గురుస్వామి రాము ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. జ్యోతిర్వా స్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వరశర్మ సిద్దాంతి మహోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కమిటీ గౌరవాధ్యక్షుడు శ్రీశైలంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రాజు, కోశాధికారి విశ్వనాథరావు, సభ్యులు మాణిక్‌రెడ్డి, పరమేశ్వర్‌గౌడ్‌, నరే్‌షకుమార్‌, బబ్లు, వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - 2022-01-14T05:30:00+05:30 IST