సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-06-01T07:04:19+05:30 IST

జిల్లాలో వానాకాలం సీజన్‌కు దగ్గర పడుతుండడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా విత్తనాలను జోరుగా కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పడగానే వానాకాలం సాగు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిమాండ్‌ ఉన్న విత్తనాలను కొనుగోలు చేస్తూ.. సాగు కోసం రైతులు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. బోధన్‌ డివిజన్‌లో ముందుగానే వరి నారుమడులను సిద్ధం

సాగుకు సన్నద్ధం
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతు

జిల్లాలో తొలకరి వర్షాలు పడగానే సాగుకు సిద్ధమవుతున్న రైతులు

వరి, సోయా, మొక్కజొన్న విత్తనాలకు భారీగా డిమాండ్‌

ధరలు పెరిగినా.. తప్పనిసరి పరిస్థితిలో కొనుగోలు చేస్తున్న అన్నదాతలు

సబ్సిడీ విత్తనాలు లేకపోవడంతో మరింత అయోమయం

ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలు తెచ్చి దోచుకుంటున్న వ్యాపారులు!!

విత్తన డీలర్లపై నిఘాపెట్టిన వ్యవసాయ శాఖ అధికారులు

జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో 5.9లక్షల ఎకరాలకు పైగా పంటల సాగు    అంచనా

నిజామాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వానాకాలం సీజన్‌కు దగ్గర పడుతుండడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా విత్తనాలను జోరుగా కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పడగానే వానాకాలం సాగు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిమాండ్‌ ఉన్న విత్తనాలను కొనుగోలు చేస్తూ.. సాగు కోసం రైతులు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. బోధన్‌ డివిజన్‌లో ముందుగానే వరి నారుమడులను సిద్ధం చేస్తున్న రైతులు, పంట సాగు కోసం ఏర్పాట్లను చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు లేకపోవడంతో సోయా, మొక్కజొన్న విత్తనాలకు భారీ డిమాండ్‌ పెరిగింది. దీంతో విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తీసుకువచ్చి మరీ ఎక్కువ రేట్లకు అమ్మకాలను చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాల సరఫరా లేకపోవడంతో మండలాల పరిధిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పలు షాప్‌లలో తనిఖీలను చేపడుతున్నారు.  ధ్రువీకరణ ఉన్న సీడ్‌నే కొనుగోలు చేయాలని రైతులను కోరుతున్నారు.

మరో వారంలో రుతుపవనాల రాక

వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతుండడంతో రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రానుండడంతో ముందస్తుగానే ఏర్పాట్లను చేసుకుంటున్నారు. యాసంగి ధాన్యం ఇంకా అమ్మకాలు చేస్తున్న రైతులు వానాకాలం సాగు కోసం విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ముందస్తుగానే పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం జూన్‌ ఆరంభంలోనే వర్షాలు జోరుగా పడడంతో పంటలు వేసిన రైతులు.. ఈ సంవత్సరం కూడా వర్షాలు త్వరలోనే వచ్చే అవకాశం ఉండడంతో సాగుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. జూన్‌ ఆరంభం అవుతుండడంతో ముందస్తుగా విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు. 

సాగయ్యే మొత్తంలో 79 శాతం వరి

జిల్లాలో ఈ సంవత్సరం వానాకాలంలో 5లక్షల 9వేల 753 ఎకరాల్లో పంటలు వేస్తారని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వానికి నివేధించారు. జిల్లాలో వానాకాలంలో సాగయ్యే మొత్తంలో సుమారు 79 శాతం 4లక్షల 1591 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేశారు. జిల్లాలో అన్ని మండలాల పరిధిలో ప్రతీ సంవత్సరం వరి పంటను రైతులు వేస్తుండడం వల్ల ఏడాదికేడాది వరి విస్తీర్ణం పెరుగుతోంది. శ్రీరామ్‌సాగర్‌, నిజాంసాగర్‌, గుత్ప అలీసాగర్‌ ప్రాజెక్లు కింద ఎక్కువగా వరి సాగవుతోంది. వీటితో పాటు రిజర్వాయర్‌, ఇతర చెరువుల కింద వరి సాగును ఎక్కువ చేస్తున్నారు. బోర్ల కింద ఎక్కువగా ఈ పంట వేస్తున్నారు. జిల్లాలో సాగయ్యే పంట ఇదే ఎక్కువ కావడంతో రైతులు గత 15 రోజుల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ వానాకాలంలో బీపీటీ 5204, తెలంగాణ సోనా 1262, సన్న రకం, దొడ్డు రకాల్లో ఎంటీయూ 1010 రకాలను ఎక్కువగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థతో పాటు ప్రైవేట్‌ విత్తనాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ వరి విత్తనాలకు డిమాండ్‌ ఎక్కువనే ఉంది. గ్రోమోర్‌ సంస్థ ద్వారా 25 కిలోల విత్తనాలను రూ.840 నుంచి రూ.890 మధ్య అమ్మకాలను చేస్తున్నారు. సన్న రకాలతో పాటు దొడ్డు రకాలను అమ్ముతున్నారు. వీటితో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా సరఫరా కోసం ఏర్పాట్లను చేశారు. ప్రైవేట్‌లో సన్న రకాలకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ప్రైవేట్‌ సంస్థలు సన్న రకాలను 20 కిలోల బస్తాను రూ.980 నుంచి వెయ్యి రూపాయల మధ్య అమ్మకాలు చేస్తున్నారు. గత వానాకాలంలో వచ్చిన దిగుబడిని బట్టి బీపీటీతో పాటు ఇతర సన్న రకాలను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు. ధర ఎక్కువైనా కొనుగోలు చేసి నారుమడులు సిద్ధం చేస్తున్నారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలోని వర్ని, మోస్రా, చందూర్‌, రుద్రూర్‌ మండలాల పరిధిలో ముందస్తుగానే నారుమడులను సిద్ధం చేయడంతో పాటు నార్లు పోశారు. వర్షాలు మొదలుకాగానే సాగుకు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరంలాగానే ఈ మండలాల పరిధిలో మరో వారం రోజుల తర్వాత నాట్లు వేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పదిహేను రోజుల నుంచి నార్లు పోసిన రైతులు భారీ వర్షం పడగానే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలతో పాటు అవసరమైన ఎరువులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు.

గత కొన్నేళ్లుగా సోయాకు డిమాండ్‌

ఈ వానాకాలంలో వరితో పాటు సోయాను అత్యధికంగా జిల్లాలో సాగుచేస్తారు. గత కొన్నేళ్లుగా సోయాకు డిమాండ్‌ పెరుగుతుండడంతో ఎక్కువ మంది రైతులు జిల్లాలో ఈ పంటను వేస్తున్నారు. జిల్లాలో జేఎస్‌335 అనే రకాన్ని ఎక్కువగా వేస్తున్నారు. ఈ రకం సోయా విత్తనాలు దొరకనివారు ఇతర రకాలవైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం సోయాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఆరుతడి పంటలు వేసేందుకు మొగ్గుచూపుతున్న రైతులు సోయా సాగుకు ఎక్కువ చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు 60వేల ఎకరాల వరకు సోయా సాగవుతుందని అంచనా వేయగా, ఈ సంవత్సరం అంతకుమించే సాగయ్యే అవకాశం కనిపిస్తోంది.  ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేట్‌లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో డిమాండ్‌ ఉన్న జేఎస్‌ 335 రకానికి 25 కిలోల బ్యాగుకు రూ.4వేల నుంచి 4500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి సరఫరా అయ్యే సోయా విత్తనాల ను కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ నుంచి గ్రీన్‌గోల్డ్‌ కంపెనీ సరఫరా చేస్తున్న 640 రకాన్ని 25కిలోల బ్యాగుకు రూ.3800 నుంచి రూ.నాలుగు వేల మధ్య రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చే త్రిషిక రకం సోయా విత్తనాన్ని 25 కిలోల బ్యాగును రూ.4200 కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చే మరో రకం కరీష్మా బ్యాగును రూ. 4వేల నుంచి రూ.4200 మధ్య రైతులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసినపుడు 25కిలోల బ్యాగును రూ.1200 నుంచి రూ.1500 మధ్యనే కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం సబ్సిడీ విత్తనాలు లేకపోవడం వల్ల ధర ఎక్కువైనా రైతులు కొనుగోలు చేస్తున్నారు. మొదటి వర్షం పడగానే విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 

ఆర్మూర్‌ పరిధిలో మొక్కజొన్న, పసుపు

జిల్లాలో ఈ రెండు రకాలతో పాటు మొక్కజొన్న సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. విత్తనాభివృద్ధి సంస్థ నుంచి సరఫరా లేకపోవడం వల్ల ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన సిజెంట, పయనీర్‌ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. పసుపుతో పాటు ఈ పంటను కూడా వేసేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది రైతులు పసుపులో అంతర పంటగా మొక్కజొన్న వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా.. మరికొంతమంది రైతులు నేరుగానే మొక్కజొన్నను వేసేందుకు సిద్ధమవుతున్నారు. ధరలు ఎక్కువైనా కొనుగోలు చేస్తూ విత్తనం వేస్తున్నారు. మొదటి వర్షం పడగానే పసుపుతో పాటు ఈ పంటను కూడా సాగుచేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఆరుతడి పంటల సాగుకూ ఏర్పాట్లు

జిల్లాలో ఇవేకాకుండా ఇతర ఆరుతడి పంటలకు కూడా వేసేందుకు రైతులు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. కంది, పెసర, మినుము, పత్తి, ఇతర పంటలు కొంతమొత్తంలో వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో రైతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుండడంతో ఆయా మండలా ల పరిధిలో వ్యవసాయశాఖ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా స్టాక్‌ను పరిశీలిస్తున్నారు. సర్టిఫైడ్‌ విత్తనాలనే కొనుగోలు చేయాలని రైతులను కోరుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయం లో తప్పనిసరిగా రసీదులను తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నకిలి విత్తనాలు అమ్మకుండ వీటితో పాటు ప్రత్యేకంగా నియమించిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కూడా దృష్టిపెట్టి తనిఖిలను కొనసాగిస్తున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇతర జిల్లాల కంటే ముందుగానే వానాకాలం సాగు

: ఆర్‌.తిరుమల ప్రసాద్‌, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి

ఇతర జిల్లాల కంటే జిల్లాలో వానాకాలం సాగు ముందుగానే రైతులు మొదలుపెడతారు. రైతులకు విత్తనాలపై కావాల్సిన అవగాహన కల్పిస్తున్నాం. సర్టిఫైడ్‌ విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు వర్షాలు సమృద్ధిగా పడిన తర్వాత సాగును మొదలుపెట్టాలంటూ రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తున్

Updated Date - 2022-06-01T07:04:19+05:30 IST