టీకా తీసుకున్నాక కరోనా.. ఎంతమందికంటే..

ABN , First Publish Date - 2021-04-22T00:32:26+05:30 IST

కొవాగ్జిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో 0.04 శాతం మంది కరోనా బారిన పడ్డట్టు తాజాగా వెల్లడైంది.

టీకా తీసుకున్నాక కరోనా.. ఎంతమందికంటే..

న్యూఢిల్లీ: కొవాగ్జిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో 0.04 శాతం మంది కరోనా బారిన పడ్డట్టు తాజాగా వెల్లడైంది. ఇక కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో 0.03 శాతం మంది కరోనా బారినపడ్డట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని భారత వైద్య ఆరోగ్య పరిశోధన మండలి పేర్కొంది. ‘‘కొవిడ్ టీకా తీసుకున్నాక ప్రతి 10 వేల మందిలో అత్యధికంగా నలుగురు కరోనా బారినపడ్డారు’’ అని ఐసీఎమ్ఆర్ చీఫ్ భార్గవ పేర్కొన్నారు. టీకా తీసుకుని కరోనా కాటుకు గురైన వారిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉందని కూడా నితీ అయోగ్ సభ్యుడు కేఏ పాల్ పేర్కొన్నారు. కరోనాను అడ్డుకోవడంలో కోవిషీల్డ్ ప్రభావశీలత దాదాపు 70 శాతమన్న విషయం తెలిసిందే. ఇక ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాల మధ్యంతర విశ్లేషణలో కొవాగ్జిన్ సామర్థ్యం 81 శాతంగా ఉన్నట్టు బయటపడింది. ఈ రెండు టీకాలను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న 15 రోజుల తరువాత తగినంత స్థాయిలో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2021-04-22T00:32:26+05:30 IST