ఐఎన్‌టీయూసీ కృషి వల్లే 10 శాతం అధిక ఎక్స్‌గ్రేషియా

ABN , First Publish Date - 2021-12-06T06:09:14+05:30 IST

ఐఎన్‌టీయూసీ కృషి వల్లనే ఎన్టీపీసీ ఉద్యోగులకు గత ఏడాది కన్నా 10 శాతం అధిక దసరా ఎక్స్‌గ్రేషి యా(స్పెషల్‌ రివార్డు) చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరిం చిందని గుర్తింపు కార్మిక సంఘం మజ్దూర్‌ యూనియన్‌ సెక్రెటరీ జనరల్‌, ఎన్‌బీసీ అదనపు సభ్యుడు బాబర్‌ సలీంపాషా స్పష్టం చేశారు.

ఐఎన్‌టీయూసీ కృషి వల్లే 10 శాతం అధిక ఎక్స్‌గ్రేషియా
విలేకరులతో మాట్లాడుతున్న బాబర్‌ సలీంపాషా

- ఎన్టీపీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి 

- విలేకరులతో గుర్తింపు సంఘం సెక్రెటరీ జనరల్‌ బాబర్‌ వెల్లడి

జ్యోతినగర్‌, డిసెంబరు 5 : ఐఎన్‌టీయూసీ కృషి వల్లనే ఎన్టీపీసీ ఉద్యోగులకు గత ఏడాది కన్నా 10 శాతం అధిక దసరా ఎక్స్‌గ్రేషి యా(స్పెషల్‌ రివార్డు) చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరిం చిందని గుర్తింపు కార్మిక సంఘం మజ్దూర్‌ యూనియన్‌ సెక్రెటరీ జనరల్‌, ఎన్‌బీసీ అదనపు సభ్యుడు బాబర్‌ సలీంపాషా స్పష్టం చేశారు. ఆదివారం యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సవవేశంలో ఆయన మాట్లాడుతూ 2020-21 ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి కరోనా తదితర విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్‌బీసీ సమావేశంలో మేనేజ్‌మెంట్‌ను ఒప్పించి గతం కన్నా ఎక్కువ ఇప్పించగలిగామన్నారు. బీఎంఎస్‌లాంటి సంఘాలు పెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే(పీఆర్‌పీ) పద్ధతిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనే వాదన చేసిందని, పీఆర్‌పీ విధానంలో ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే ఉద్యోగులు నష్టపోతారని తాము గట్టిగా వాదించినట్లు చెప్పారు. పీఆర్‌పీ వల్ల ట్రేడ్‌ యూనియన్ల ఉనికే లేకుండా పోతుందన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలకు సంబంధించి త్వరలోనే మరో ఎన్‌బీసీ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. 2018 బ్యాచ్‌ డిప్లొమా ట్రైనీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వచ్చే నెలలోనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని, ఈ విషయంలో యాజమాన్యం సానుకూ లంగా ఉందని బాబర్‌ పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ కౌన్సిల్‌లో కార్యదర్శి లాంటి కీలక బాధ్యతను ఉద్యోగికే నామినేట్‌ చేయాలని, ఈ విషయంలో యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రాజెక్టులో కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వేతన సవరణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధిక శాతం ఎక్స్‌గ్రేషియా ఇప్పించ డంలో కృషి చేసిన బాబర్‌ను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ విలేకరుల సమావేశంలో అధ్యక్ష,కార్యదర్శులు రాజేశ్వర్‌, కందుల స్వామి, బండార కనకయ్య, అశోక్‌రెడ్డి, కమలాకర్‌రావు తదితరలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T06:09:14+05:30 IST