ఏపీకి 10 లక్షల ఇళ్ళు మంజూరు చేశాం : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-09-21T21:43:59+05:30 IST

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం కింద ఆంధ్రప్రదేశ్

ఏపీకి 10 లక్షల ఇళ్ళు మంజూరు చేశాం : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ/అమరావతి : ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2016 నుంచి 2019 వరకు 10.50 లక్షల ఇళ్ళు మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ రాష్ట్రానికి కేటాయించిన 10.50 లక్షల ఇళ్ళలో 2.93 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన ఇళ్ళు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. 2022 మార్చి నాటికి వీటి నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

Updated Date - 2020-09-21T21:43:59+05:30 IST